TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం..

  • నేడు టీటీడీ పాలకమండలి సమావేశం..
  • 2026-27 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న పాలకమండలి..
  • రూ. 5700 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం..
Ttd

Ttd

TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈరోజు సమావేశం కానుంది. 2026-27 వార్షిక సంవత్సరానికి రూ. 5700 కోట్ల అంచనాతో బడ్జెట్ కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టీటీడీ విద్య సంస్థల అభివృద్ధికి రూ. 100 కోట్లు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే, తిరుమలలో రిలయన్స్ సహకారంతో రూ. 100 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ అన్నప్రసాద సముదాయం నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకల ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించేందుకు ముడుపు పత్రం విధానాన్ని టీటీడీ ప్రారంభించనుంది.

Read Also: Koel Mallick: రాజ్యసభకు హీరోయిన్ కోయల్ మల్లిక్.. పెద్దల సభలో పెరుగుతున్న గ్లామర్ ఫీల్డ్

ఇక, శ్రీవాణి నిధులు వ్యయానికి సంబంధించిన మార్గదర్శకాలను మార్పు చేసేందుకు టీటీడీ ప్రతిపాదనలు చేస్తుంది. ఒంటిమిట్టలో రూ. 20 కోట్ల వ్యయంతో జాంబవంతుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయింపు, అలిపిరి తనిఖి కేంద్రంలో రూ. 8 కోట్ల వ్యయంతో స్కానర్లు ఏర్పాటు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.