NTV Telugu Site icon

TTD EO Dharma Reddy: ఆనం వెంకటరమణారెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సవాల్..

Ttd Eo Dharmareddy

Ttd Eo Dharmareddy

TTD EO Dharma Reddy: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. వెంకట రమణారెడ్డి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. దేవాదాయశాఖ చట్టం మేరకు టీటీడీ ఈవోగా నియమితులవ్వాలంటే జిల్లా కలెక్టర్ లేదా సమాన హోదాలో పని చేసి వుండాలన్నారు. 1991 బ్యాచ్‌కి చెందిన తాను ప్రిన్సిపల్ సెక్రటరి హోదా కంటే ఎక్కువ హోదాలో వున్న పోస్టులో భాధ్యతలు నిర్వర్తించాననని ఆయన చెప్పారు. తన నియామకంపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే దానిని హైకోర్టు కొట్టివేసిందన్నారు.

Also Read: TTD Recruitment 2023 : టీటీడీ లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం.. అర్హతలు?

2014లో ఢిల్లీ కంటోన్మెంట్ డిఫెన్స్ సీఈఓగా వున్నప్పుడు అక్రమ కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు. 2020లో వారు కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తే దానికి సంబంధించి సమన్లు గత ఏడాది జారీ చేశారన్నారు. సమన్లు స్వ్కాష్ చేయాలని కోర్టులో కేసు వేస్తే దానిపై స్టే విధించారన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. “నేను టీటీడీలో అవినీతి చేసానని ఆరోపిస్తున్నారు.. నేను టీటీడీకి వచ్చిన గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఫిక్స్‌డ్ డిఫాజిట్ల ద్వారా రూ.4800 కోట్లు.. బంగారం 3885 కేజీల డిఫాజిట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.1021 కోట్లు నిధులు జమ అయ్యాయి. దాతల సహకారంతో 175 కోట్లతో చిన్నపిల్లల హస్పిటల్స్, 135 కోట్లతో మ్యూజియం అభివృద్ది, 274 కోట్లు స్విమ్స్‌లో 1200 పడకల హాస్పిటల్‌గా అభివృద్ధి పరుస్తున్నాం.” అని అన్నారు.