TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం టోకెన్లు జారి చేస్తున్న టీటీడీ..
- గతంలో మధ్యాహ్నం సమయంలో టోకెన్లు జారీ..
- శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఎప్పుడూ భక్తులతో రద్దీగానే ఉంటుంది.. అయితే, తిరుమల ప్లాన్ చేసుకునే భక్తులకు కీలక సమాచారం వచ్చింది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచన చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో మార్పులు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో మధ్యాహ్నం సమయంలో టోకెన్లు ఇచ్చే విధానం అమల్లో ఉండేది. అయితే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమయాల్లో మార్పులు చేసినట్లు సమాచారం.
Read Also: Potato Storage Tips: బంగాళాదుంపలను ఇలా నిల్వ చేయండి.. వారాలు గడిచినా తాజాగా ఉంటాయి..
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని Srinivasam Complex, Vishnu Nivasam, Alipiri Bhudevi Complex కేంద్రాల్లో జారీ చేస్తున్నారు. భక్తులు ముందస్తుగా చేరుకుని టోకెన్లు పొందాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా సెలవు రోజులు, వారాంతాలు, పండుగల సమయంలో భారీగా భక్తులు తరలివస్తుండటంతో టోకెన్ల కోసం ముందుగానే క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు కొత్త సమయాలను గమనించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అధికారిక ప్రకటనలు, తాజా సమాచారం తెలుసుకుని ప్రయాణం చేయడం మంచిదని అధికారులు తెలిపారు. కావున, తిరుమల వెళ్లే భక్తులు ఇది దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!