కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో మరోమారు పోటెత్తనుంది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం అయింది. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ. ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను కలిశారు తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏ వీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.
Read Also: TTD: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు
ఈసందర్భంగా స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవోలు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందచేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్.జగన్‌కు ఆహ్వాన పత్రం అందజేశారు టీటీడీ ఛైర్మన్, ఈవోలు. బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్చించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.
Read Also: Record Level Sales in Festive Season: స్మార్ట్‌ఫోన్ సంస్థలకు రికార్డ్ స్థాయి కొనుగోళ్ల ‘పండగ’
