NTV Telugu Site icon

Cheetah TTD : తిరుమల కొండపై బోనులో చిక్కిన చిరుత

Cheetah

Cheetah

తిరుమల అలిపిరి రోడ్డులో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ఓ బాలికపై చిరుత దాడి చేసి మృతి చెందడంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు అలిపిరి నడకదారిలో బోనును ఏర్పాటు చేశారు. గత రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన చిరుత బోనులో చిక్కుకుంది. గత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు.

Also Read : Hardik Pandya: ఓటమి కూడా మంచిదే.. చాలా సంతోషంగా ఉన్నా! హార్దిక్‌ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు

అలిపిరి మార్గంలో మూడు చిరుతలు సంచరిస్తున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ఆడ చిరుతగా గుర్తించారు. రాత్రి బోనులో చిక్కుకున్నది ఆడ చిరుతపులి అని ధర్మారెడ్డి తెలిపారు. నామాల బావికి సమీపంలో ఉన్న బోనులో చిరుత చిక్కుకుందని ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Also Read : Masa Sivaratri: ఈ స్తోత్రాలు వింటే అన్ని బాధలు తక్షణమే తొలగిపోతాయి

అలిపిరి ఫుట్ పాత్ పై శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చిరుతపులి దాడితో ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాత్రి చోటు చేసుకుంది. మరో గంట ప్రయాణం ముగించుకుని తిరుమలకు చేరుకోబోతుండగా ముందుగా వెళ్తున్న బాలికపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వారు భయంతో కేకలు వేయడంతో చిరుతపులి బాలికను అడవిలోకి లాగింది.

టీటీడీ అధికారులు శనివారం బాలిక మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తిరుమల దేవస్థానం చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేసింది. అలిపిరి నడక మార్గం రాత్రిపూట పరిమితం చేయబడింది.

 

Show comments