Site icon NTV Telugu

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. బల్క్‌ బుకింగ్‌ టిక్కెట్లు రద్దు..!

Ttd

Ttd

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాలన మొదలు పెడతామంటూ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదుకు తగిన విధంగానే ముందుకు సాగుతున్నారు.. ఇక, టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. దర్శన టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు పారదర్శకంగా కేటాయించే విధంగా చర్యలకు దిగుతోంది.. అందులో భాగంగా దళారులకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యంది.. అయితే, ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దళారులు బల్క్ బుకింగ్‌గా పెద్ద ఎత్తున దర్శన టికెట్లతో పాటు వసతి గదులు పొందినట్లు గుర్తించింది టీటీడీ.. దీంతో.. బల్క్ బుకింగ్ కింద పొందిన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. అలాంటి వారి పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు టీటీడీ అధికారులు.. ఫేస్ రికగ్నిషన్ (ఫేషియల్ రికగ్నిషన్) విధానంలో భక్తులు టికెట్లు పొందేలా మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు.. అంతేకాదు.. ఆధార్ అనుసంధానానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోందట టీటీడీ.. అంటే.. టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. మొత్తం దళారి వ్యవస్థకే పులిస్టాప్‌ పెట్టేలా ఉంటుంది.

Read Also: Spicejet employee: వివాదం అవుతున్న జైపూర్ ఎయిర్‌పోర్టు ఘటన.. ఏం జరిగిందంటే..!

Exit mobile version