TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించింది. ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం ఖరారు కాగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి రాజకీయ నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం, తరచూ విమర్శలకు దిగడం వంటి ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొండ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇలాంటి పద్ధతులు నిత్యకృత్యంగా మారాయి. తిరుమల ఆలయం, పరిసరాల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు ఈ చర్య అవసరమని టీటీడీ పేర్కొంది.
RC16 Divyenddu: చరణ్ కోసం మున్నా భయ్యా.. ఏం ప్లాన్ చేశావ్ బుచ్చిబాబు?
ఇదిలా ఉంటే.. అలాగే సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించి ప్రభ్వుత శాఖలకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో తెలిపారు.
Amaran : అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.!