Site icon NTV Telugu

TTD Tickets Online : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Ttd

Ttd

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను నేడు విడుదల చేయనున్నారు. టీటీడీ షెడ్యూల్ ప్రకారం.. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జులై 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.

Also Read : TS Rain: తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి.. టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జులై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అక్టోబరు నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జులై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలి. భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్యూల్‌ ప్రకారం టికెట్లను రిలీజ్‌ చేశామని టీటీడీ తెలిపింది. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Also Read : Tomato: పెరుగుతున్న టమాటా దొంగతనాలు.. యూపీలో 25కిలోలు ఎత్తుకెళ్లిన దొంగలు

Exit mobile version