తెలంగాణ వ్యాప్తంగా గణేష్ చతుర్థి సందడి నెలకొంది. గణేష్ మంటపాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రత తప్పనిసరి అన్నారు TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి. వినాయక చవితి పండుగ సందర్భముగా ఏర్పాటు చేసే మండపాల వద్ద విద్యుత్ భధ్రత, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ చేపట్టిన పనులపై సిఎండి రఘుమారెడ్డి సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాల వద్ద పాటించాల్సిన విద్యుత్ భద్రతా జాగ్రత్తలను ఆయన వివరించారు.
Read Also: Jay Shah: జాతీయ జెండా ఎందుకు వద్దన్నాడు? అమిత్ షా తనయుడిపై కాంగ్రెస్ నేత విమర్శలు
* మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు విద్యుత్ స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందగలరు.
* మండపంలో గల విద్యుత్ పరికరాల లోడ్ కు తగిన నాణ్యమైన కేబుల్స్ ను వాడాలి. జాయింట్లు వున్న, ఇన్సులేషన్ లేని వైర్లను వాడటం అపాయకరం.
* మండపాల్లో లోడ్ కు తగ్గ కెపాసిటీ కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్) లను తప్పనిసరిగా వాడాలి, ఒక వేళ ఎంసీబీలు ఓవర్ లోడ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
* విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్స్ వద్ద గణేష్ మండపాలను ఏర్పాటు చేయరాదు. మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
* విద్యుత్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. విద్యుత్ వైర్ల/ పోల్స్ మరియు ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుండి పిల్లల్ని దూరంగా ఉంచండి.
* ఒక వేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు.
* విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగి పడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912 / 100 /సమీప ఫ్యుజ్ ఆఫ్ కాల్ కు కాల్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.