Betting Apps : ఇన్‌ప్లూయెన్సర్లు జర పైలం.. ఇలా చేస్తే ఇక మీరు జైలుకే
- ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ట్వీట్
- సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
- వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరం. : వీసీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి , పేద కుటుంబాలకు బెట్టింగ్ మహమ్మారిలా మారింది.
MLC Kavitha : కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పుల బాధ భరించలేక, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలే దేశవ్యాప్తంగా అనేక మంది యువకులు, ఉద్యోగులు బెట్టింగ్ వల్ల తమ ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు వెలుగుచూశాయి. భారతదేశంలో బెట్టింగ్ ప్రధానంగా చట్ట విరుద్ధమైనదే. ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయడం లేదా వీటిలో ఆడించడం జైలుశిక్ష , భారీ జరిమానాలకు దారి తీస్తుంది. ఇటీవల, పలు రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్‌పై నిషేధాన్ని విధించాయి.
అయితే.. ఈ విషయంపై తాజా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, యువతను ఆన్‌లైన్ పందాలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించిందని ఆయన పేర్కొన్నారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని, గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటే అని, సమాజ శ్రేమస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపండని హితవు పలికారు. స్వార్థానికి పోయి అమాయకుల ప్రాణాలకు బాధ్యులు కాకండని ఆయన తెలిపారు.
Nani: నాని ఇంత చీప్ పని చేస్తావా.. నిర్మాత ఫైర్!
ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చ… pic.twitter.com/WSuRzwWNeQ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 30, 2025
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!