TSRTC ZIVA Water Bottles: తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారాన్ని నేడు ప్రారంభించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు జీవా మంచి నీటి బాటిల్స్ ను నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఆర్టీసీ జీవా వాటర్ బాటిల్స్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ప్రతేడాది 90లక్షల నీటిని టీఎస్ ఆర్టీసీ బయటనుంచి కొటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇక నుంచి సొంతంగా తయారు చేసుకున్న జీవానే వాడుతామన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులకు ఇచ్చే టిక్కెట్లే ప్రధాన ఆదాయ వనరుగా ఇప్పటి వరకు ఉందన్నారు మంత్రి. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి బడ్జెట్‌లో 15వందల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
Read Also: Shocking Accident : ప్రయాణికుల పాలిట ఉరి తాళ్లుగా మారుతున్న కేబుల్స్
జీవా వాటర్ వల్ల ఆర్టీసీకి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం లీటర్ బాటిళ్ళు అందుబాటులో ఉంటాయని, త్వరలో 250 ఎంఎల్, అర లీటర్ బాటిళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే పెట్రోల్ బంక్‌లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తోండగా.. తాజాగా డిమాండ్ ఎక్కువగా ఉన్న డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలోకి ప్రవేశించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంత బ్రాండ్ పేరుతో ప్యాకెజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను విక్రయించాలని భావిస్తోంది.కేంద్రం డీజిల్ ధరలు పెంచడం వల్ల ఆర్టీసీపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రిపువ్వాడ.. ఇది దాదాపు ప్రతిరోజూ రూ. 2కోట్లకు పైగా ఉందన్నారు. దీంతో సంస్థ ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఇతరత్రా మార్గాలపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
Read Also: Indigo Flight : రోడ్లపై అయిపోయాయి.. ఇక విమానాల్లో మొదలయ్యాయి
ఏ ఒక్క సర్వీసును ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయలేదన్నారు. అరకొర సమాచారంతో సంచలనాల కోసం బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 97 డిపోలు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. సజ్జనార్ ఆధ్వర్యంలో 27 డిపోలు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదంటూ.. త్వరలోనే మరిన్ని కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.