Site icon NTV Telugu

TSRTC: టీఎస్‌ఆర్టీసీకి భారీ ఆదాయం.. 11 రోజుల్లోనే రూ.165.46 కోట్ల రాబడి

Tsrtc

Tsrtc

TSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులకు విశేష ఆదరణ లభించింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది.

CS Review on Kantivelugu: కంటి వెలుగు అమలుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

గతేడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా ప్రయాణించగా.. ఈ సంక్రాంతికి 11 రోజుల్లోనే మొత్తంగా రూ.165.46కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనంగా ఆదాయం లభించింది. ఈ సంక్రాంతి సందర్భంగా 3.57 కోట్ల కిలోమీటర్ల టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గతేడాదితో పోలిస్తే 26.60లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయని తెలిసింది. గతేడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ భారీగా పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్‌) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. సాధారణ ఛార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని సజ్జనార్ తెలిపారు.

Exit mobile version