TSPSC Group-4: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గ్రూప్-4 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు.
Read Also: Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్, స్టడీ సర్టిఫికేట్స్(1వ తరగతి నుంచి ఏడు వరకు), రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచిచింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఏ సర్టిఫికెట్ లేకున్నా రిజెక్ట్ అవుతారు… అదనపు టైమ్ ఇవ్వడం ఉండదని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.