NTV Telugu Site icon

Telangana Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. తుది కీ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

Tspsc

Tspsc

Telangana Group-1: రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మంగళవారం తన వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీని విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో 5 ప్రశ్నలను రద్దు చేయాలని, 3 ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్‌ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది.

గ్రూప్‌-1 కీని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్‌ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు.

Steve Jobs Old Sandals: స్టీబ్‌ జాబ్స్ పాత చెప్పుల వేలం.. ధరెంతో తెలిస్తే షాకవుతారు?

అక్టోబర్ 16న గ్రూప్-1 సర్వీసులకు ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ నిర్వహించింది. అక్టోబర్ 29న ప్రిలిమినరీ కీని తన వెబ్‌సైట్‌లో విడుదల చేయగా, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై టీఎస్‌పీఎస్సీ అభ్యంతరాలను స్వీకరించింది. కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా అభ్యంతరాలు స్వీకరించిన కమిషన్‌ తాజాగా తుది మాస్టర్‌ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.