NTV Telugu Site icon

TSPSC Group 4: గ్రూప్ 4 పరీక్షా తేదీ ఖరారు..

Tspsc Group 4 Exam

Tspsc Group 4 Exam

TSPSC Group 4 Exam on 1st June: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ). యువత ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 పరీక్షా తేదీని గురువారం ప్రకటించింది. జూలై 1న తెలంగాణ వ్యాప్తంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని నోటిఫికేషన్ లో తెలిపింది.

Read Also: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం..ఈడీ ఛార్జీషీట్‌లో కేజ్రీవాల్ పేరు..

గ్రూప్-4 పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా భారీ పోటీ నెలకొంది. మొత్తం ఉన్న పోస్టులు 8,180 పోస్టులకు ఏకంగా 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీస్ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. గ్రూప్-4 విభాగంలో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటికి గత డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది.

Show comments