Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tspcb Fined To Stone Crushers

TSPCB : స్టోన్ క్రషింగ్ యూనిట్లపై కొరడా.. రూ.5.5 కోట్ల పర్యావరణ పరిహారం

Published Date :November 17, 2022 , 5:10 pm
By Gogikar Sai Krishna
TSPCB : స్టోన్ క్రషింగ్ యూనిట్లపై కొరడా.. రూ.5.5 కోట్ల పర్యావరణ పరిహారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) జీఓ 111 పరిధిలోని స్టోన్ క్రషింగ్ యూనిట్లపై రూ.5.5 కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధించింది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 111 ప్రకారం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి, నిర్మాణ పనులను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. జీఓ 111 ప్రాంతంలో నిర్వహిస్తున్న అక్రమ, అనధికార స్టోన్ క్రషర్ యూనిట్లపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సౌత్ బెంచ్‌లో హైదరాబాద్‌కు చెందిన పీవీ సుబ్రమణ్య వర్మ పిటిషన్ దాఖలు చేయడంతో పెనాల్టీ విధించారు.

Also Read : Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని వట్టినాగులపల్లి, కోకాపేట్, గౌల్దొడ్డి, గోపన్‌పల్లి, కొల్లూరు, కొత్వాల్‌గూడ, ఉస్మాన్‌నగర్‌ గ్రామాల్లో క్రషర్లు ఉన్నాయి. అక్టోబర్ 14న జరిగిన విచారణ అనంతరం తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీసీబీని ఎన్జీటీ ఆదేశించింది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ సరస్సుల 10కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్లలో బోర్డు అధికారులు అక్టోబర్‌, నవంబర్‌లో తనిఖీలు చేపట్టారు. బోర్డు అనుమతి లేకుండా యూనిట్లను నిర్వహించడం, బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగించడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి కారణాలతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఉల్లంఘించిన యూనిట్లకు నోటీసులు జారీ చేసింది.

టీఎస్‌పీసీబీ, జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్ మరియు ఆర్‌సి పురం జోనల్ కార్యాలయంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు విచారణ నిర్వహించి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని సిఫార్సు చేసింది. అనంతరం ఒక్కో స్టోన్ క్రషర్ యూనిట్ కు రూ.8.45 లక్షల నుంచి రూ.91 లక్షల వరకు పరిహారం విధించారు. జరిమానాతో కూడిన యూనిట్లలో శేరిలింగంపల్లిలోని గ్రేట్ ఇండియా మైనింగ్, శ్రీ లక్ష్మీ నరసింహ మెటల్ ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్, హైదరాబాద్ రాక్ సాండ్, ఆదేశ్వర్ ట్రేడర్స్, తేజా రెడ్డి క్రషర్స్, సిఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (క్రషర్) ఉన్నాయి. వట్టినాగులపల్లికి చెందిన పేరులేని స్టోన్ క్రషర్, గండిపేటకు చెందిన షామా మెటల్ సప్లై, డీబీఆర్‌ మెటల్ ఇండస్ట్రీ, కొత్వాల్‌గూడకు చెందిన SMI స్టోన్ క్రషర్ (షామా మెటల్ ఇండస్ట్రీ), శ్రీ సాయి బాలాజీ రాక్ సాండ్ ఇండస్ట్రీ ఉన్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 111 GO
  • breaking news
  • latest news
  • NGT
  • Stone Crushers

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions