TS TET 2023 Results: రేపే తెలంగాణ టెట్- 2023 ఫలితాలు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్ పరీక్ష కు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్ 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు.అయితే టెట్ పరీక్ష పేపర్-1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.అలాగే పేపర్ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5089 ఉపాధ్యాయ పోస్టులకు సెప్టెంబర్ 7 న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 20 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనుంది. దీనితో టెట్ ఫలితాల ప్రకటన తరువాత అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసే వీలు ఉంటుంది. దీనితో టెట్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 25)సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సీటెట్ 2023 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 29 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. సీ టెట్ లో అర్హత సాధించిన వారు కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఆర్టీ కి అర్హులే…
Also Read
- RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!