Site icon NTV Telugu

TS SSC : ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

Ssc

Ssc

తెలంగాణ ప్రభుత్వం టెన్త్‌ పరీక్షా విధానంలో మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతంలో 11 పేపర్లుగా ఉంటే విధానాన్ని 6కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్‌. అయితే.. 2022-23 నుంచి పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది విద్యాశాఖ. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను చెరో రెండు పేప‌ర్లుగా పరీక్షలు నిర్వహించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష నిర్వహించేవారు. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు. టెన్త్ ఎగ్జామ్స్ సన్నద్ధతపై మంత్రి కార్యాలయంలో సమీక్షించారు. వంద శాతం సిలబస్ తో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Also Read : Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ పరిస్థితి విషమం

పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని తెలిపారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Exit mobile version