Site icon NTV Telugu

TS SSC : మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలు.. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొండిలా..!

Ts Ssc

Ts Ssc

తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ రెండు వరకు 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యా్హ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ భాష (కాంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుంది. సైన్స్ విషయంలో రెండు భాగాలు, పార్ట్-I ఫిజికల్ సైన్స్, పార్ట్-II బయోలాజికల్ సైన్స్, రెండు వేర్వేరు రోజులలో ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల కోసం 2676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మొత్తం 5,08,385 మంది (బాలురు: 2,57,952, బాలికలు: 2,50,433) అభ్యర్థులు పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. విద్యార్థులు, సిబ్బంది పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్ళడం నిషేధం. విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు (ఫోన్ నెం:040-23230942) చేశారు. హాల్-టికెట్లు, ముద్రించిన నామినల్ రోల్స్ ఇప్పటికే రాష్ట్రంలోని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా పాఠశాలలకు పంపబడ్డాయి. అభ్యర్థులు తమ హాల్-టికెట్లను సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ నుండి పొందవచ్చు. www.bse.telangana.gov.in నుండి విద్యార్థులు హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. పరీక్షలకు హాజరుకావచ్చు. హాల్ టిక్కెట్లలో మీడియం లేదా సబ్జెక్ట్ కోడ్‌లకు సంబంధించి ఏవైనా సవరణలు గమనించినట్లయితే, సంబంధిత హెడ్ మాస్టర్లు వెంటనే ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు తెలియజేయాలి.

TS SSC Hall Ticket 2024:ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

Exit mobile version