తెలంగాణలో లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్ సెట్ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. రాష్ట్రంలోని దాదాపు 30కి పైగా లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న పరీక్ష నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షలకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,218మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 25,747మంది పోటీ పడ్డారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Also Read : Video : Perni Nani vs Pawan Kalyan – చెప్పు రాజకీయం
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే.. నేడు ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు.
Also Read : Manipur Violence: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత.. ఇంఫాల్‌లో ఇళ్లకు నిప్పు..
