NTV Telugu Site icon

TS Govt Chief Whip Vinay Bhaskar : అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం

Dasyam Vinay Bhaskar

Dasyam Vinay Bhaskar

హనుమకొండ జిల్లా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకి గ్రేటర్ పరిధిలో 1000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ మరమ్మత్తుల కోసం మంత్ర కేటీఆర్ 250 కోట్లను విడుదల చేశారని, గత ప్రభుత్వాల హయాంలోనే నాలాల ఆక్రమణలకు గురయ్యాయన్నారు వినయ్‌ భాస్కర్‌. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, టికెట్ ఎవరికీ ఇచ్చిన పార్టీ సైనికులుగా కార్యకర్తగా పనిచేస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా వరంగల్ పట్టణంలో అనేక ఇబ్బందులు ఎదురుకొన్నామని, నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. గతంలో నగరాన్ని సందర్శించి కేటీఆర్ 250కోట్లు మంజూరు చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున కురిసిన వర్షాల కారణంగా సమ్మయ్య నగర్, జవహర్ నగర్ వరద ముంపు కు గురి కావడం జరిగిందన్నారు.

Also Read : Vadlamani Priya : గ్లామర్ షో తో రెచ్చకొడుతున్న ” వడ్లమాని ప్రియ”..

అంతేకాకుండా.. ‘ఆగష్టు లో పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదలు వచిన్నపుడు అన్ని డిపార్ట్మెంట్ లు కలిసి పనిచేయడం జరిగింది. వర్షాలు ఆగిపోయిన తరువాత, జరిగిన నష్టన్ని అంచనా వేసి సుమారు 1000కోట్లు మేర నష్టం జరిగింది. నాళాలు, రోడ్లు దెబ్బతిన్నవి, వాటిని రిపేర్ చేయడానికి, నిన్న కేటీఆర్ 250కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేసారు. జరిగిన నష్టం అంచనా తక్షణ సాయం కింద 250కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదములు తెలుపుతున్నాం. వరదలు వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం దుర్మార్గం. భద్రకాళి బండ్ పైన కొంత మేర కోతకు గురైతే ప్రజలను భయబ్రాంతులకు కొందరు గురి చేయడం జరిగింది. ప్రతి పక్షాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని కడిస్తున్నాం. నాలాల అక్రమ నిర్మాణాలు గతంలో జరిగిన మా పైన నిందలు వేయడాన్ని తీవ్రంగా కండిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నగర ప్రజలకు కనీసం ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. రాబోయే రోజులలో కాంగ్రెస్ ఇక్కడ రాదు కేంద్రంలో రాదు. బీజేపీ నాయకులు మీ పరపతి ఉపయోగించి నగరానికి నిధులు తీసుకురావాలి. ప్రజలకు మంచి పనులు చేసి వారికి అండగా ఉందాం. వరదల సహాయక చర్యలో పాల్గొన్న అనేక స్వచ్చంద సంస్థలకు ధన్యవాదములు. ప్లాస్టిక్ ను నివారిద్దాం. రాబోయే తరాలకు పచ్చని ప్రాంతాలను ఇద్దాము. ‘ అని వినయ్‌ భాస్కర్‌ వ్యాఖ్యానించారు.

Christopher Tilak: మళ్ళీ ఎన్నికల్లో మోసం చేసేందుకు వస్తారు ఎవరు నమ్మవద్దు