NTV Telugu Site icon

TS ECET Counselling: ఈసెట్ అభ్యర్థులకు అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్..

Ts Ecet Counselling

Ts Ecet Counselling

తెలంగాణ ఈసెట్-2024 ఫలితాలు 20 మే 2024 న విడుదలయ్యాయి. తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో ఈ ఏడాది మొత్తం 23,330 మంది పరీక్షకు హాజరవ్వగా.. వీరిలో 22,365 మంది అర్హతను సాధించారు. ఈసెట్ 2024 లో 95.86% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కొరకు తెలంగాణ ఈసెట్ – 2024 పరీక్షను మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకల ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలను పొందుతారు. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.

TS Polycet Counselling: పాలిటెక్నిక్ చేరే విద్యార్థులకి అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

ఇక ఇందుకు సంబంధించి ఈ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు ఫేజుల్లో ఈ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. జూన్ 8 నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు ప్రక్రియ మొదలు అవుతుంది. జూన్ 18న తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది.

TS Engineering Counselling: ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షురూ..

జులై 15 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. జులై 17నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనునారు. జులై 21న సీట్ల రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత ఏవైనా సీట్స్ ఖాళీగా ఉంటే జులై 24న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాల విడుదల చేస్తారు.