Site icon NTV Telugu

TS Eamcet 2023 : విద్యార్థులకు అలర్ట్‌.. ఎంసెట్‌ పరీక్ష తేదీల్లో మార్పులు

Ts Eamcet

Ts Eamcet

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష షెడ్యూల్లో ఉన్నత విద్యామండలి మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్ యూజీ, టీఎస్ పీఎస్సీ పరీక్షల కారణంగా ఎంసెట్ పరీక్షల తేదీల షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యామండలి వెల్లడించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ పరీక్ష జరగనుంది. గతంలో మే 7, 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read : Viral : వీడి కక్కుర్తి పాడుగాను.. రెండేళ్లుగా పెంపుడు కుక్కపై అత్యాచారం

అదే సమయంలో, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో జరగనున్నాయని తెలిపింది. కాగా, మే 2వ తేదీ వరకు లేట్ ఫీజుతో ఎంసెట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

Also Read : Oscar: చంద్రబోస్ ని సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్!

Exit mobile version