Papaya Seeds: బొప్పాయి తిని గింజలు పడేస్తున్నారా? అవి తింటే పురుషులలో వచ్చే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papaya Seeds: బొప్పాయి మంచి ఔషధాల గని. బొప్పాయి పండులా తింటారు.. కొందరు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. బొప్పాయి ఆకులు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. బొప్పాయి ఆకుల రసాన్ని ప్లేట్లెట్స్ తగ్గిన వారికి ఇస్తారని.. అయితే ఇప్పుడు బొప్పాయి పండులోని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం బొప్పాయి పండు తిని గింజలను పారేస్తాం.. అయితే ఆ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే.. విసిరేసే ముందు ఆలోచిస్తాం.. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఈ బొప్పాయి పండులో ఉన్నాయి. అంతే కాకుండా నట్స్‌లో మంచి పోషకాలు కూడా ఉంటాయి.
Read also: MLC Kavitha: అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం
Also Read
- మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
- Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
- 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు, రక్త సరఫరాకు, దంత సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, బొప్పాయి పండు మాత్రమే కాకుండా దాని గింజలు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఈ బొప్పాయి గింజలను రోజూ తింటే రోగాలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఈ బొప్పాయి గింజలను రోజూ తింటే పొట్టలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. పురుషులలో సంతానలేమి సమస్యలను తగ్గిస్తుంది. శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. కడుపులోని వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణాశయంలోని క్రిములు నాశనమవుతాయి. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ముఖ్యంగా విత్తనాలు తినడం వల్ల మన కడుపులో ఉండే క్రిములు నశిస్తాయి. బొప్పాయి పండులోని ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా వచ్చే జ్వరం దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న బొప్పాయి గింజలను ఇక నుంచి పడేయకుండా తినడానికి ట్రై చేయండి.
బొప్పాయి గింజల వల్ల ఇతర ప్రయోజనాలు:
1. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి
2. శరీర బరువును నియంత్రిస్తుంది
3. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
5. జీర్ణాశయంలో బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది
6. గర్భిణీ స్త్రీలలో ప్రసవానంతర నొప్పులను తగ్గిస్తుంది
7. పురుషులలో సంతానలేమి సమస్యలను తగ్గిస్తుంది
8. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది
9. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది
10. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
11. కాలేయ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
12. క్యాన్సర్ కణాలు మరియు కణాలు పెరగకుండా నియంత్రిస్తుంది.
13. మూత్ర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది
14. శరీరం నుండి అనేక రకాల క్యాన్సర్లను తొలగిస్తుంది
15. చెడు కొవ్వులను నియంత్రిస్తుంది.
ఎలా ఉపయోగించాలి:
ఈ విత్తనాలను నేరుగా తినలేము కాబట్టి. వీటిని ఎండబెట్టి పొడి చేసి.. సాయంత్రం పూట తాగే జ్యూస్‌లలో కలుపుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలోని పై సమస్యలన్నీ తొలగిపోతాయి. అదనంగా, శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?