Site icon NTV Telugu

Vizag: కిడ్నీ రాకెట్ కేసులో వెలుగులోకి నిజాలు.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు

Vizga Kidnry Rocket

Vizga Kidnry Rocket

కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు వస్తున్నాయి. దీంతో.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తుంది. కిడ్నీ మార్పిడి కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కీలక పాత్ర పోషించింది. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద పది లక్షలు వసులు చేసి.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించింది. మొత్తం రూ. 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో.. మోసపోయామని తెలుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Viral Video: దేవుడా.. యూట్యూబర్‌కు కూడా ఇంతమంది అభిమానులా! స్టార్‌లు చూస్తే అంతే సంగతులు

మరోవైపు.. కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు పెంచారు. డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు స్పెషల్ టీం వేశారు సీపీ శంఖబ్రత బాగ్చీ. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో జరిగిన కిడ్నీ ఆపరేషన్, మార్పిడి వివరాలను స్పెషల్ టీం సేకరిస్తున్నారు. కాగా.. వివరాలు మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు ఆసక్తి చూపడం లేదు.

UK Elections: బ్రిటీష్ గడ్డను తాకిన లేబర్ తుఫాన్‌.. బాధితురాలిగా మాజీ ప్రధాని లిజ్ ట్రస్

Exit mobile version