Viral Video: దేవుడా.. యూట్యూబర్‌కు కూడా ఇంతమంది అభిమానులా! స్టార్‌లు చూస్తే అంతే సంగతులు
- యూట్యూబర్‌కుభారీగా ఫాన్స్
- సెలబ్రిటీలకు మించిన అభిమానులు
- స్టార్‌లు చూస్తే అంతే సంగతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Fight for US YouTuber IShowSpeed: సాధారణంగా సినిమా స్టార్‌లకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు భారీగా అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా.. వారిని చూసేందుకు లేదా కలిసేందుకు ఎగబడుతుంటారు. అయితే ఓ యూట్యూబర్‌కు సెలబ్రిటీలకు మించిన ఫాన్స్ ఉన్నారు. మాల్ నుంచి అతడు బయటకు రాగానే ఫాన్స్ ఎగబడ్డారు. ఫాన్స్ తోపులాట కారణంగా అల్లాడ తొక్కిసలాట జరిగింది. చాలా మంది గాయాలపాలయ్యారు కూడా. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ యూట్యూబర్ మరెవరో కాదు.. అమెరికా చెందిన ఐషో స్పీడ్. ఇతడి అసలు పేరు ‘డారెన్ వాట్కిన్స్ జూనియర్’. యూట్యూబ్‌లో ఐషో స్పీడ్ ఛానెల్‌కు 2.5 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియోలను కూడా చేస్తుంటాడు. ఎంతో ఆసక్తికర వీడియోలను అతడు పోస్ట్ చేయడమే ఇంతమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. డారెన్ వాట్కిన్స్ పోస్ట్ చేసే వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోస్ వివాదాస్పదంగా కూడా ఉంటాయి. ఐషో స్పీడ్ ఒక్క వీడియో పోస్ట్ చేస్తే.. కోట్లలో లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. అదే రీతిలో సంపాదన కూడా ఉంటుంది.
Also Read
Also Read: Virat Kohli-London: రాత్రికి రాత్రే లండన్‌కు వెళ్లిపోయిన కోహ్లీ.. కారణం ఏంటంటే?
తాజాగా ఐషో స్పీడ్ లైవ్ స్ట్రీమింగ్ కోసం నార్వే వెళ్లాడు. లైవ్ స్ట్రీమింగ్ అనంతరం.. ఓ షాపులోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న నార్వే ఫాన్స్.. అతడిని చూసేందుకు క్యూ కట్టారు. ఐషో స్పీడ్‌తో ఫొటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడ జనం భారీ స్థాయిలో గుమిగూడారు. దీంతో అతడు బయటకు కష్టమైంది. స్థానిక పోలీసుల సహాయంతో బయటకు వచ్చినా.. అతడిని అభిమానులు వదలలేదు. అతికష్టం మీద ఐషో స్పీడ్‌ను బయట వెళ్లి కారు ఎక్కాడు. ఆ సమయంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘దేవుడా.. యూట్యూబర్‌కు కూడా ఇంతమంది అభిమానులా’, ‘ఈ జనాలను స్టార్‌లు చూస్తే కుళ్లుకుంటారు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Bro got assaulted pic.twitter.com/RAuItFTfoQ
— Speedy Updates (@SpeedUpdates1) July 3, 2024
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!