US – Cuba War: ట్రంప్ ‘వార్’ వార్నింగ్.. క్యూబాపై యుద్ధ మేఘాలు! అమెరికా తదుపరి టార్గెట్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US – Cuba War: అమెరికా, క్యూబా దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వెనిజులా, ఇరాన్‌లపై సైనిక చర్యల తర్వాత ఇప్పుడు అమెరికా దృష్టి క్యూబాపై పడిందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న హెచ్చరికల నేపథ్యంలో, క్యూబా తన రక్షణ సన్నాహాలను ముమ్మరం చేసింది. క్యూబా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు ఆప్షన్లు ఉంచారని సమాచారం. ఒకటి వాషింగ్టన్ విధించే షరతులకు లొంగిపోయి రాజీ పడటం, లేదా సైనిక చర్యను ఎదుర్కోవడం. ఈ నేపథ్యంలో క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ తమ దేశ సైన్యాన్ని, ప్రజలను అప్రమత్తం చేశారు. అమెరికా దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ఈ సన్నాహాలు కేవలం ఆత్మరక్షణ కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
READ ALSO: Vijayawada: టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్.. వెలుగులోకి కొత్త నిజాలు.!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
సంక్షోభాన్ని నివారించేందుకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నట్లు క్యూబా ఉప విదేశాంగ మంత్రి కార్లోస్ ఫెర్నాండెజ్ డి కోసియో తెలిపారు. అయితే, ఈ చర్చల్లో అమెరికా ఒక కఠినమైన షరతు పెట్టినట్లు తెలుస్తోంది. క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ తన పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమే కానీ, దేశ రాజకీయ నిర్మాణం, అధ్యక్ష పదవి విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని క్యూబా తేల్చి చెప్పిందని తెలుస్తుంది.
అంధకారంలో క్యూబా
యుద్ధ భయం ఒకవైపు ఉంటే, ఇంధన సంక్షోభం క్యూబాను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. గత వారంలో రెండుసార్లు నేషనల్ గ్రిడ్ విఫలమవడంతో దేశమంతా అంధకారంలో మునిగిపోయింది. ఆసుపత్రుల్లో విద్యుత్ లేక శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనాలు రోడ్ల మీద నిలిచిపోగా, విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. గతంలో వెనిజులా నుంచి క్యూబాకు ఉచితంగా చమురు అందేది. కానీ వెనిజులాపై అమెరికా దాడి తర్వాత ఆ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. క్యూబాకు చమురు అమ్మే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతంలో వెనిజులాలో నికోలస్ మదురోను గద్దె దించేందుకు అమెరికా ఎలాంటి వ్యూహాలను అనుసరించిందో, ఇప్పుడు క్యూబా విషయంలోనూ అవే కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక ఆంక్షల ద్వారా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి, ఆపై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
READ ALSO: Actor Rajasekhar: డాన్స్ రాదని ఒప్పుకున్న రాజశేఖర్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?