Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా సమర్థించే మిత్రదేశాలు, ఇప్పుడు అమెరికా నిర్ణయాలపై తమ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు నాటో (NATO) దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో నాటో దేశాలు తనకు అండగా నిలుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించారు. అయితే ఈ కీలక యూరోపియన్ దేశాలు మాత్రం యుద్ధంలో నేరుగా పాల్గొనేందుకు నిరాకరించాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, నాటోను “కాగితపు పులి” అని అభివర్ణించారు. యూరప్ దేశాలు తమ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడుతూ, అవసరమైనప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
అమెరికా యూరప్‌ను రక్షించడానికి వస్తుందా..
అమెరికా తీరుపై పోలాండ్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ తీవ్రంగా స్పందించారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అమెరికా విశ్వసనీయతను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా నమ్మదగ్గదేనా? అని ప్రశ్నించారు. ఒకవేళ రష్యా దాడి చేస్తే, నాటో ఒప్పందం ప్రకారం అమెరికా యూరప్‌ను రక్షించడానికి వస్తుందా? అనే అనుమానాన్ని ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. అమెరికాపైనే పూర్తిగా ఆధారపడకుండా, యూరప్ దేశాలన్నీ కలిసి ఒక బలమైన రక్షణ కూటమిని ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే కొన్ని నెలల్లో రష్యా ఏదైనా నాటో సభ్యదేశంపై దాడి చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. గతేడాది పోలాండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించినా, నాటో దేశాలు ఏమీ జరగనట్లే నటించాయని ఆయన విమర్శించారు.
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
ఈమెయిల్స్ లీక్..
ఇదే సమయంలో అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)కు చెందిన కొన్ని అంతర్గత ఈమెయిల్స్ బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇరాన్ విషయంలో అమెరికాకు సహకరించని నాటో దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని కూటమి నుంచి సస్పెండ్ చేయాలని ట్రంప్ యంత్రాంగం చర్చించినట్లు ఈ ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది. నాటో నుంచి స్పెయిన్‌ను తొలగిస్తారనే వార్తలను ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఖండించారు. అయితే అమెరికా – నాటో మధ్య విభేదాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రాధాన్యతలు మారుతుండటం, మరోవైపు రష్యా నుంచి ముప్పు పొంచి ఉండటంతో యూరప్ దేశాల్లో ఆందోళన మొదలైంది. నాటోలోని అంతర్గత విభేదాలు ప్రపంచ శాంతికి సవాలుగా మారే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?