NTV Telugu Site icon

Donald Trump: లక్షల మంది భారతీయులకు ట్రంప్ గుడ్‌న్యూస్.. ఆ వీసాదారులకు నో టెన్షన్

H 1b Visa

H 1b Visa

హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. “నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం.” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా.. అమెరికాలో ఈ హై స్కిల్ వీసా పొందుతున్న వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 2024లో జారీ చేసిన మొత్తం 2 లక్షల 80 వేల హెచ్-1బీలో భారతీయులు దాదాపు 2 లక్షల వీసాలు పొందారు.

READ MORE: IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!

గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ వీసాలపై వివాదం చెలరేగింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘‘హెచ్‌–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్‌–1బీ వీసాదారులున్నారు. హెచ్‌–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని వ్యాఖ్యానించారు.

READ MORE: Akhanda2 – Thaandavam: బాలయ్య కోసం గోల్డెన్ లెగ్.. తప్పించి తెచ్చారా, తప్పుకుంటే తెచ్చారా?

హెచ్-1బీ వీసా అంటే ఏంటి?
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది. కాబట్టి నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు. జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్-1990 అమల్లోకి వచ్చింది.