Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పరిధిని పెంచే ఓ కీలక చట్టంపై శుక్రవారం సంతకం చేశారు. ఈ నూతన చట్టం ప్రకారం రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేసే భారత్, చైనాల వంటి దేశాలపై విపరీతమైన సుంకాలను (టారిఫ్‌లు) విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ రష్యా అండ్ ఇరాన్ శాంక్షన్స్ ఆక్ట్, 2026’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బుధవారమే ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కోసం సౌత్ కరోలినాకు చెందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఏడాదికి పైగానే శ్రమించారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం దీనికి ఆ పేరే పెట్టారు. వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ చట్టం రష్యాపై చట్టపరమైన ఆంక్షలు, సుంకాలు విధించేందుకు పూర్తి అధికారాలను ఇవ్వడమే కాకుండా, ఇరాన్‌పై ఇదివరకే ఉన్న ఆంక్షలను పొడిగిస్తుంది.
ఈ చట్టం ద్వారా లభించిన అధికారంతో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లను విధించవచ్చు. ఆయా దేశాలపై ఎంతెంత టారిఫ్ వేయాలనేది పూర్తిగా అధ్యక్షుడి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ గనుక భారతదేశంపై 100 శాతం టారిఫ్ విధించాలని నిర్ణయిస్తే, అది మన దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భారత్ నుంచి అమెరికా మార్కెట్‌కు వెళ్లే ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయి, అక్కడ మన వస్తువుల విక్రయాలు తగ్గిపోతాయి. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడుతుంది. ఇక, ఈ కొత్త చట్టం రష్యాలోని కీలక అధికారులను, బ్యాంకింగ్ రంగాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. వాటితో పాటు రష్యన్ ఇంధనాన్ని రహస్యంగా సరఫరా చేస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తిప్పికొట్టే ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మొత్తానికి రష్యా, ఇరాన్‌ల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు, రష్యా వద్ద చమురు కొనుగోలు చేసే పెద్ద దేశాలను 100% టారిఫ్‌ల బెదిరింపుతో అదుపు చేయడమే లక్ష్యంగా అమెరికా ఈ కొత్త చట్టాన్ని ఆమోదించింది.
Also Read
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
తాజావార్తలు
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..