అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను తాను ప్రతిపాదించిన $175 బిలియన్ల ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ షరతు విధించారు. “వారు ఒక ప్రత్యేక దేశంగా ఉంటే వారికి $61 బిలియన్లు ఖర్చవుతుందని నేను కెనడాకు చెప్పాను, కానీ వారు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే వారికి సున్నా డాలర్లు ఖర్చవుతాయి” అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు. “వారు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు” అని అధ్యక్షుడు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read:Hajj Yatra 2025: సౌదీ అరేబియా అధికారిక ప్రకటన.. హజ్ యాత్ర అప్పటినుంచే ప్రారంభం..!
గత వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం ప్రణాళికలను ఆవిష్కరించారు. ఇది మొదటిసారిగా అమెరికన్ ఆయుధాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే $175 బిలియన్ల బహుళస్థాయి వ్యవస్థ. ఓవల్ కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. 2029 నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా పనిచేయగలదని, అంతరిక్షం నుంచి ప్రయోగించబడినా, క్షిపణులను అడ్డగించగలదని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
Also Read:US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశం.. ఆ కారణంతోనే..
కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తన ప్రభుత్వం గోల్డెన్ డోమ్ కార్యక్రమంలో పాల్గొనడం గురించి అమెరికాతో చర్చలు జరుపుతోందని అంగీకరించారు. “కెనడియన్లకు భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది” అని మార్క్ కార్నీ గత వారం విలేకరుల సమావేశంలో అన్నారు. అధునాతన క్షిపణి కవచం గోల్డెన్ డోమ్ గురించి అధ్యక్షుడు ట్రంప్, ఇతర సీనియర్ అమెరికా అధికారులతో చర్చలు జరిపినట్లు ఆయన ధృవీకరించారు.
