Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా పౌరసత్వ చట్టాల్లో అత్యంత కీలకమైన పుట్టుకతో వచ్చే పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్), బర్త్ టూరిజంలపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమరశంఖం పూరించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంతో దురదృష్టకరమని అభివర్ణించిన ఆయన, ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేస్తూ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై గురువారం సంతకాలు చేశారు. గతేడాది అమెరికా పౌరులు కానివారికి పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేసేలా ట్రంప్ ఒక విప్లవాత్మక ఉత్తర్వు తెచ్చారు. అయితే, అమెరికా భూభాగంపై జన్మించిన ఎవరికైనా పౌరసత్వం పొందే హక్కును రాజ్యాంగంలోని 14వ సవరణ కల్పిస్తోందని పేర్కొంటూ, జూన్ 30న సుప్రీంకోర్టు ఆ ప్రయత్నాన్ని కొట్టివేసింది. సుప్రీం తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, ఈసారి కొంత పరిమితంగా ఉన్నప్పటికీ కఠినమైన నిబంధనలతో ఈ కొత్త ఉత్తర్వులను తీసుకొచ్చారు.
వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల ముఖ్య వ్యూహకర్త స్టీఫెన్ మిల్లర్ తెలిపిన వివరాల ప్రకారం… వైట్ హౌస్ జారీ చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విదేశీ శత్రువులు, ఉగ్రవాద సంస్థల సభ్యులు, విదేశీ ప్రభుత్వాల తరఫున పనిచేసే లాబీయిస్టుల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. వీరి పిల్లలకు అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. ఇక రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ‘బర్త్ టూరిజం’పై దాడి పెంచింది. కేవలం మాతృత్వం ద్వారా పిల్లలకు అమెరికా పౌరసత్వం తెప్పించడానికే వీసా పొందే విధానాన్ని అమెరికా చట్టాలు ఇప్పటికే నిషేధించాయి. అయితే ఈ నూతన ఉత్తర్వు ఆ బర్త్ టూరిజంపై పూర్తిస్థాయి నిషేధాన్ని మరింత పటిష్టం చేస్తుందని మిల్లర్ చెప్పారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఇక సుప్రీంకోర్టు తీర్పు విషయానికొస్తే.. అమెరికాలో శతాబ్ద కాలంగా వస్తున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. తల్లిదండ్రులు అమెరికాలో అక్రమంగా ఉన్నా లేదా తాత్కాలికంగా ఉన్నా, ఇక్కడ జన్మించిన పిల్లలు పౌరులేనని స్పష్టం చేసింది. సీనియర్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ధర్మాసనం తరఫున తీర్పు రాస్తూ… “రాజ్యాంగాన్ని రూపొందించినవారు ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ ఈ హక్కును ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మేము నిలబెడుతున్నాం” అని పేర్కొన్నారు. మరొక జడ్జి బ్రెట్ క్యావనా కూడా ట్రంప్ పాత ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అయితే, దౌత్యవేత్తల పిల్లలకు, శత్రుదేశాల ఆక్రమణ సమయంలో జన్మించిన పిల్లలకు మాత్రమే మినహాయింపులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై కోర్టులోని కన్జర్వేటివ్ జడ్జీల నుంచి తీవ్ర విభేదాలు వ్యక్తమయ్యాయి. జస్టిస్ క్లారెన్స్ థామస్ తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ తీర్పు ద్వారా బర్త్ టూరిస్టులకు, అక్రమ చొరబాటుదారుల పిల్లలకు పౌరసత్వాన్ని కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ నీల్ గోర్సచ్, జస్టిస్ శామ్యూల్ అలిటో కూడా ఈ తీర్పుతో విబేధించారు. ఇక, న్యాయస్థానం ఇచ్చిన సవాలును పక్కనపెట్టి, చట్టంలోని సందుగొందులను ఉపయోగించుకుంటూ బర్త్ టూరిజంకు చెక్ పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు