Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Netanyahu: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు మధ్య దోస్తీ చెడుతోంది. ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రులుగా పేరున్న ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఇప్పుడు విభేదాల సెగలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ వ్యవహారంలో ఒకరికొకరు తోడుగా ఉంటారని అంతా భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలను నెతన్యాహు బేఖాతరు చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బెరూట్పై దాడులు చేయవద్దని ట్రంప్ కోరినప్పటికీ, ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాంబుల వర్షం కురిపించడంతో ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్ స్పష్టంగా బయటపడింది. ఇజ్రాయెల్ చేసిన ఈ సాహసానికి ప్రతిచర్యగా ఏప్రిల్ నాటి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ మొదటిసారిగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడటం యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వేర్వేరు నిర్ణయాలు తీసుకోవడానికి ఆయా దేశాల్లోని రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణం. అమెరికాలో ఎన్నికల ముంగిట ఉన్న ట్రంప్, వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని గట్టిగా కోరుకుంటున్నారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలంటే ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని తిరిగి తెరిపించడం ట్రంప్‌కు అత్యంత కీలకం. అయితే ఇరాన్ మాత్రం లేబనాన్‌లో సంపూర్ణ కాల్పుల విరమణ జరిగితేనే శాంతి చర్చలకు వస్తామని షరతు పెడుతోంది. అందుకే ట్రంప్ దూకుడు తగ్గించాలని కోరుతుంటే, నెతన్యాహు మాత్రం తన సొంత రాజకీయ ఉనికి కోసం యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో నెతన్యాహు గెలవాలంటే, హెజ్బొల్లా దాడులను పూర్తిగా అణిచివేసి తానే విజేతనని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు అమెరికా వంటి అగ్రరాజ్యంతో మైత్రిని కాపాడుకుంటూనే, మరోవైపు అమెరికా మాటలకు లొంగిపోయామన్న ముద్ర పడకుండా నెతన్యాహు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకరిది ఆర్థిక, రాజకీయ స్థిరత్వం కోసం తాపత్రయమైతే, మరొకరిది ఉనికిని కాపాడుకునే పోరాటం కావడంతో.. మిత్రులైన ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు ‘యుద్ధం’ కొత్త మలుపులు తిరుగుతోంది.
Also Read
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!