Site icon NTV Telugu

Donald Trump: ఇంతకీ నీ భర్త ఎక్కడ..? నిక్కి హేలిని ఎగతాళి చేసిన ట్రంప్‌

Trump

Trump

అమెరికా అధ్యక్ష పదవి కోసం తన సొంత రిపబ్లికన్‌ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో-అమెరికన్‌ నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలి ఇంతకీ నీ భర్త ఎక్కడ? ఉన్నాడని ఎగతాళి చేశారు. దీనిపై స్పందించిన హేలి సైనిక కుటుంబాలను అవమానించే వ్యక్తికి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉండే అర్హత లేదని ధీటుగా సమాధానం ఇచ్చింది.

Read Also: Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం

అయితే, డొనాల్డ్ ట్రంప్‌ నువ్వేమన్నా చెప్పాలనుకుంటే నా వెనుక చెప్పకూడదు.. ఇద్దరం చర్చ పెట్టుకుందాం.. నీవు చెప్పాల్సిందేమన్నా ఉంటే అక్కడే నా ముఖం మీద చెప్పు’ అని ఆయన అన్నారు. 75 ఏండ్లు దాటిన రాజకీయవేత్తల మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయించాలని తాను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాను అని నిక్కీ హేలి పేర్కొన్నారు. కాగా, హేలి భర్త మేజర్‌ మైఖేల్‌ హేలి దక్షిణ కరోలినా నేషనల్‌ గార్డులో కమిషన్డ్‌ అధికారిగా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్‌ నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.

Exit mobile version