Trump: “నాకు నోబెల్ బహుమతి వద్దు.. కానీ” డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం అనేక ముఖ్యమైన ప్రకటనలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాను నోబెల్ శాంతి బహుమతిని కోరుకోవడం లేదని, గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ అన్నారు. గాజా వివాదం కోసం తన కాల్పుల విరమణ ప్రతిపాదన దాదాపుగా ఖరారు అయిందని పేర్కొన్నారు. “మధ్యప్రాచ్యం మొత్తం సంతకం చేయమని మేము కోరుతున్నాం. ఇది అసాధ్యమైన పని, కానీ అది పూర్తయింది. ఇప్పుడు మనం హమాస్ కోసం వేచి ఉండాలి. వారు సంతకం చేయకపోతే, పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి” అని ట్రంప్ తెలిపారు.
READ MORE: Oppo A6 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో కొత్త ఫోన్ విడుదల..
Also Read
- Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- ‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
- TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
హమాస్ కు మూడు నుంచి నాలుగు రోజుల సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఒకవేళ వారు నిరాకరిస్తే, ఇజ్రాయెల్ కు “ఏది కావాలంటే అది చేసుకునేందుకు” స్వేచ్ఛ ఇస్తానన్నారు. “హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, వారు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. మేము 25,000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులను చంపి, వారి నాయకత్వాన్ని మూడుసార్లు నిర్మూలించాం. ఇప్పుడు, వారు శాంతిని కోరుకుంటే మంచిది.. లేకుంటే పరిస్థితులు మరింత దిగజారిపోతాయి” అని ట్రంప్ హెచ్చరించారు. రష్యా గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఇటీవల మాస్కో అమెరికాను బెదిరించిందని.. ప్రతి స్పందనగా రష్యా తీరంలో రెండు అణు జలాంతర్గాములు మోహరించినట్లు తెలిపారు. అణ్వాయుధాలను ఉపయోగించాల్సి వస్తే, తమ దగ్గర ఇతర దేశాల కన్నా అధికంగా ఉన్నాయని తెలిపారు.
READ MORE: 1020 Movies Hacked: ఇదేం కిక్ రా స్వామీ.. కిక్ కోసం ఇంత పని చేస్తావా బాబు?
తాజావార్తలు
-
Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!