Donald Trump: నా డ్యాన్స్ అంటే నా భార్యకు ఇష్టం లేదు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్టేజ్‌పై హంగామా చేయడం, డ్యాన్స్ వేయడం కొత్త కాదు. కానీ తన డ్యాన్స్‌లపై ఎక్కువగా విమర్శలు చేసే వ్యక్తి ఎవరో కాదు.. ఇంట్లోనే ఉన్న తన భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అని స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మడురో తన డ్యాన్స్‌ను అనుకరిస్తాడని ట్రంప్ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్‌లోని ట్రంప్–కెనడీ సెంటర్‌లో రిపబ్లికన్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, మడురో గురించి ప్రస్తావిస్తూ.. “మడరో నా డ్యాన్స్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు హింసాత్మకంగా ప్రవర్తించే వ్యక్తి. లక్షల మందిని చంపాడు. చాలా మందిని హింసించాడు. కరాకాస్ నడిబొడ్డులో టార్చర్ చాంబర్ సైతం ఉంది” ఆరోపించారు.
READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రంప్ తన ఎన్నికల ర్యాలీల్లో ‘వైఎంసీఏ’ పాటకు చేసే డ్యాన్స్ చాలా ప్రసిద్ధి. అయితే ఆ డ్యాన్స్ తన భార్యకు అస్సలు నచ్చదని ఆయన నవ్వుతూ చెప్పారు. “నేను ఇలా డ్యాన్స్ చేయడం నా భార్యకు అస్సలు నచ్చదు. ఆమె చాలా క్లాసీ. అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఇలా డ్యాన్స్ చేయడం తగదని చెబుతుంది” అని ట్రంప్ అన్నారు. ఆ కార్యక్రమానికి మెలానియా హాజరుకాలేకపోయినా, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను ట్రంప్ అక్కడే నటిస్తూ చూపించారు. తన డ్యాన్స్ తన భార్యకు నచ్చకపోయినా.. తన అభిమానులు ఇష్టపడతారని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు.
READ MORE: Kavitha : కవిత రాజీనామాకి ఆమోదం
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!