Site icon NTV Telugu

Donald Trump: నా డ్యాన్స్ అంటే నా భార్యకు ఇష్టం లేదు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్టేజ్‌పై హంగామా చేయడం, డ్యాన్స్ వేయడం కొత్త కాదు. కానీ తన డ్యాన్స్‌లపై ఎక్కువగా విమర్శలు చేసే వ్యక్తి ఎవరో కాదు.. ఇంట్లోనే ఉన్న తన భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అని స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మడురో తన డ్యాన్స్‌ను అనుకరిస్తాడని ట్రంప్ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్‌లోని ట్రంప్–కెనడీ సెంటర్‌లో రిపబ్లికన్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్, మడురో గురించి ప్రస్తావిస్తూ.. “మడరో నా డ్యాన్స్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు హింసాత్మకంగా ప్రవర్తించే వ్యక్తి. లక్షల మందిని చంపాడు. చాలా మందిని హింసించాడు. కరాకాస్ నడిబొడ్డులో టార్చర్ చాంబర్ సైతం ఉంది” ఆరోపించారు.

READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రంప్ తన ఎన్నికల ర్యాలీల్లో ‘వైఎంసీఏ’ పాటకు చేసే డ్యాన్స్ చాలా ప్రసిద్ధి. అయితే ఆ డ్యాన్స్ తన భార్యకు అస్సలు నచ్చదని ఆయన నవ్వుతూ చెప్పారు. “నేను ఇలా డ్యాన్స్ చేయడం నా భార్యకు అస్సలు నచ్చదు. ఆమె చాలా క్లాసీ. అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఇలా డ్యాన్స్ చేయడం తగదని చెబుతుంది” అని ట్రంప్ అన్నారు. ఆ కార్యక్రమానికి మెలానియా హాజరుకాలేకపోయినా, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను ట్రంప్ అక్కడే నటిస్తూ చూపించారు. తన డ్యాన్స్ తన భార్యకు నచ్చకపోయినా.. తన అభిమానులు ఇష్టపడతారని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు.

READ MORE: Kavitha : కవిత రాజీనామాకి ఆమోదం

Exit mobile version