Site icon NTV Telugu

Tariffs: ఇంపోర్టెడ్ మీడియం, హెవీ ట్రక్కులపై 25% సుంకం.. ప్రకటించిన ట్రంప్

Trump

Trump

ట్రంప్ టారిఫ్స్ బాంబులను పేల్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ట్రక్కులపై సుంకాలను ప్రకటించాడు. మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ సుంకం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే మొదట దీనిని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్, పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని పంచుకుంటూ, అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విదేశీ పోటీ నుంచి అమెరికన్ తయారీదారులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య వాణిజ్య రక్షణవాదాన్ని ముందుకు తీసుకువెళుతుందని, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుందని ట్రంప్ తెలిపారు.

Also Read:Crime News: తండ్రిని నెట్టేసి.. కన్నతల్లినే హత్య చేసిన కొడుకు

అమెరికా కార్మికులను రక్షించడానికి ఈ సుంకాలు అవసరమని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశీయ ట్రక్ తయారీదారులకు మద్దతు ఇవ్వడం ఈ చర్య లక్ష్యమన్నారు. కొత్త సుంకాలు పాక్కర్ (పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్‌లను కలిగి ఉన్నవి) మరియు డైమ్లర్ ట్రక్స్ ఫ్రైట్‌లైనర్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం, జపాన్, యూరోపియన్ యూనియన్‌తో ఉన్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం, అమెరికా తేలికపాటి వాహనాలపై 15 శాతం సుంకాన్ని విధిస్తోంది. అయితే, కొత్త నిర్ణయం తర్వాత ఈ రేటు పెద్ద వాహనాలకు వర్తిస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.

Exit mobile version