Trump: దావోస్ వెళ్తుండగా ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం.. తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయిన ట్రంప్

  • ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం
  • దావోస్ వెళ్తుండగా సమస్య
  • తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయిన ట్రంప్
Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ పర్యటన రద్దైనట్లుగా తెలుస్తోంది. దావోస్ వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో యు-టర్న్ తీసుకొని వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లిపోయినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.

దావోస్‌లో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు మంగళవారం వాషింగ్టన్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరారు. అయితే ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎలక్ట్రికల్ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. వెంటనే పైలట్లు విమానాన్ని వాషింగ్టన్‌కు మళ్లించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య