NTV Telugu Site icon

Donald Trump: ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించే పనిలో పడ్డ అమెరికా

Donald

Donald

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులకు సంతకం చేశారు. వాటిలో ఒకటి ట్రాన్స్‌జెండర్ లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధించడం. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ సభ్యులను ఆర్మీ నుంచి తొలగించే విధానం రూపొందించేందుకు అమెరికా రక్షణ శాఖకు 30 రోజుల గడువు ఇచ్చారు. రక్షణ శాఖ గురువారం విడుదల చేసిన ఒక మెమోరాండం ప్రకారం, లింగ డిస్‌ఫోరియా (Gender Dysphoria) సమస్యను ఎదుర్కొంటున్న లేదా చికిత్స పొందుతున్న సైనికులను గుర్తించేందుకు మార్చి 26లోపు మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ గుర్తింపు ప్రక్రియ స్వీయ నివేదిక లేదా సహచరుల సమాచారంపై ఆధారపడే అవకాశం ఉంది.

Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో నేడు ఆసక్తికర సమరం.. అఫ్గానిస్థాన్‌ మరో షాకిచ్చేనా!

ఒకసారి ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించిన తర్వాత, ఆయా విభాగాలకు వారిని సైన్యంనుంచి తొలగించేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అమెరికా అధికారులు అందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం, సైన్యంలో ఉన్న కొన్ని వందల మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని వారి వైద్య రికార్డుల ద్వారా గుర్తించవచ్చు. ఈ చర్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. లింగ డిస్‌ఫోరియాతో బాధపడే వ్యక్తులు శారీరక, మానసిక పరంగా అవసరమైన సైనిక ప్రమాణాలకు తగినట్లు ఉండరని అధికురుల వాదనగా చెప్పవచ్చు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. కోర్టులో కేసులు దాఖలు చేశారు. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదులు.. అమెరికాని “అసమానత్వం” గా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను తక్కువగా చూపించే విధంగా ఈ నిర్ణయం ఉందని.. ఇది వారి గౌరవాన్ని తగ్గించే చర్య అని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా అధికారుల అంచనా ప్రకారం, నౌకాదళంలో దాదాపు 600 మంది, ఆర్మీలో 300 నుంచి 500 మంది ట్రాన్స్‌జెండర్ సైనికులు ఉన్నట్లు సమాచారం. వీరి వైద్య రికార్డుల ఆధారంగా వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

Read Also: Rajasthan: స్కూల్ బాలికలపై లైంగిక దోపిడి, మత మార్పిడి.. బేవార్‌లో ఉద్రిక్తత..

ఈ వివాదాస్పద నిర్ణయం అమలులోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడే సంస్థలు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని ఒంటరిని చేసే చర్యగా మారుతుందని, సమానత్వ హక్కులను ఉల్లంఘించే నిర్ణయమని వారు అభిప్రాయపడుతున్నారు.