Donald Trump: ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించే పనిలో పడ్డ అమెరికా
- ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించే పనిలో పడ్డ అమెరికా
- డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్ లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధం.
- నౌకాదళంలో దాదాపు 600 మంది, ఆర్మీలో 300-500 మంది ట్రాన్స్‌జెండర్ సైనికులు ఉన్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులకు సంతకం చేశారు. వాటిలో ఒకటి ట్రాన్స్‌జెండర్ లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధించడం. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ సభ్యులను ఆర్మీ నుంచి తొలగించే విధానం రూపొందించేందుకు అమెరికా రక్షణ శాఖకు 30 రోజుల గడువు ఇచ్చారు. రక్షణ శాఖ గురువారం విడుదల చేసిన ఒక మెమోరాండం ప్రకారం, లింగ డిస్‌ఫోరియా (Gender Dysphoria) సమస్యను ఎదుర్కొంటున్న లేదా చికిత్స పొందుతున్న సైనికులను గుర్తించేందుకు మార్చి 26లోపు మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ గుర్తింపు ప్రక్రియ స్వీయ నివేదిక లేదా సహచరుల సమాచారంపై ఆధారపడే అవకాశం ఉంది.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర సమరం.. అఫ్గానిస్థాన్ మరో షాకిచ్చేనా!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఒకసారి ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించిన తర్వాత, ఆయా విభాగాలకు వారిని సైన్యంనుంచి తొలగించేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అమెరికా అధికారులు అందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం, సైన్యంలో ఉన్న కొన్ని వందల మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని వారి వైద్య రికార్డుల ద్వారా గుర్తించవచ్చు. ఈ చర్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. లింగ డిస్‌ఫోరియాతో బాధపడే వ్యక్తులు శారీరక, మానసిక పరంగా అవసరమైన సైనిక ప్రమాణాలకు తగినట్లు ఉండరని అధికురుల వాదనగా చెప్పవచ్చు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. కోర్టులో కేసులు దాఖలు చేశారు. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదులు.. అమెరికాని “అసమానత్వం” గా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను తక్కువగా చూపించే విధంగా ఈ నిర్ణయం ఉందని.. ఇది వారి గౌరవాన్ని తగ్గించే చర్య అని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా అధికారుల అంచనా ప్రకారం, నౌకాదళంలో దాదాపు 600 మంది, ఆర్మీలో 300 నుంచి 500 మంది ట్రాన్స్‌జెండర్ సైనికులు ఉన్నట్లు సమాచారం. వీరి వైద్య రికార్డుల ఆధారంగా వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read Also: Rajasthan: స్కూల్ బాలికలపై లైంగిక దోపిడి, మత మార్పిడి.. బేవార్‌లో ఉద్రిక్తత..
ఈ వివాదాస్పద నిర్ణయం అమలులోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడే సంస్థలు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని ఒంటరిని చేసే చర్యగా మారుతుందని, సమానత్వ హక్కులను ఉల్లంఘించే నిర్ణయమని వారు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..