Site icon NTV Telugu

True Lover: ఓటీటీలో దూసుకుపోతున్న సూపర్ హిట్ మూవీ..

True Lover

True Lover

టీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. అందులో లవ్ స్టోరీతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.. మొన్న మలయాళం వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే తమిళ్ లో వచ్చిన లవర్ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది..

ఈ ల‌వ్ స్టోరీ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్. మార్చి 27న త‌మిళం, తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో ట్రూ ల‌వ‌ర్ రిలీజ్ మంగళవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది… ట్రూ ల‌వ‌ర్ సినిమాలో మ‌ణికంద‌న్‌, శ్రీగౌరిప్రియ ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఈ ప్రేమ‌క‌థా చిత్రానికి ప్ర‌భురామ్ వ్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.. తమిళంలో లవర్ పేరుతో వచ్చిన ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ గా రిలీజ్ అయ్యింది..

చిన్న సినిమాగా వచ్చి కోట్లు అందుకుంది.. ఇక తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ట్రూ ల‌వ‌ర్‌లో న‌టించిన శ్రీ గౌరిప్రియ తెలుగు హీరోయిన్‌గా కావ‌డం గ‌మ‌నార్హం.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని ఆమె లవర్ అనుమానిస్తాడు.. అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తుంది.. చివరికి అతను ఎలా మారతాడు? ఆమె ప్రేమ గెలుస్తుందా? అనేది సినిమా కథ.. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి..

Exit mobile version