TRS Leader Karne Prabhakar about Munugodu By Poll
టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బయటకు వస్తూనే ఉన్నా.. ఆ పార్టీ అగ్రనేతలు మాత్రం ఎలాంటి విభేదాలు, సమస్యలు లేవంటూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. అయితే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సైతం గులాబీ జెండా నీడలో అంతర్గత విభేదాలు ఉన్నా.. అవి ఇప్పుడు బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మునుగోడు గులాబీ జెండా ఎగురేసేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈ పార్టీయే కాకుండా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం మునుగోడులో గెలిచేందుకు పథకాలు పన్నుతున్నాయి. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుఫున పాల్వాయి స్రవంతిని బరిలో దించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఇక టీఆర్‌ఎస్ పార్టీ తరుఫున ఎవరు పోటీలో ఉంటారనేదానిపై స్పష్టత రాలేదు.
మొదట్లో కుసుకుంట్ల ప్రభాకర్ పేరు వినిపించినా.. నియోజకవర్గంలో క్యాడేర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ ఆలోచన టీఆర్‌ఎస్ పెద్దలు మానుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. మొత్తమీద టీఆర్‌ఎస్ నుంచి మునుగోడు టికెట్‌ను ఆశించి వారి సంఖ్య పదికి పైమాటే అంట. ఈ సందర్భంగా మునుగోడులో టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో సమాచారం ఇవ్వకపోవడం నియోజకవర్గ బాధ్యుల విచక్షణకు వదిలేస్తున్నానన్నారు. నేను కేసీఆర్ సైనికుడి అనిచ, ఎవరు పిలిచినా పిలవకపోయినా కేసీఆర్ కోసం పని చేస్తా అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఆశావాహులు పది మంది ఉన్నారు, వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కచ్చితంగా పని చేస్తానని ఆయన వెల్లడించారు. ఇక్కడ ఉన్న పెద్దలు పిలవడం లేదని నేను అలిగి ఇంట్లో పడుకోననని ఆయన తెలిపారు.
