Site icon NTV Telugu

Janhvi Kapoor: నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్! వీడియో వైరల్

Janhvi Kapoor Rakhi

Janhvi Kapoor Rakhi

Janhvi Kapoor Ties Rakhi To Pap: దేశవ్యాప్తంగా సోమవారం ‘రాఖీ’ పండగ ఘనంగా జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ రక్షా బంధన్‌ను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కూడా రాఖీ పండగను జరుపుకున్నారు. సినిమా షూటింగ్‌లో ఉన్న జాన్వీతో ఓ ఫోటోగ్రాఫర్ రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం అతడు తన జేబులో చేయి పెట్టి డబ్బులు తీయగా.. అయ్యో వద్దు అంటూ జాన్వీ అక్కడినుంచి వెళ్లిపోయారు.

యువకుడికి జాన్వీ కపూర్‌ రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజెన్స్ అయితే సదరు యువకుడిని ఓ ఆటాడుకుంటున్నారు. ‘నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్’, ‘అందమైన అమ్మాయితో రాఖీ కట్టించుకున్నావ్ ఏంది రా అయ్యా’, ‘జాన్వీ కపూర్‌కే డబ్బులివ్వబోయిన ఫ్యాన్’ ‘నువ్ తోపు బ్రో’ అంటూ నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Rana Daggubati: కారు ఆపి మరీ.. అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన రానా!

బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకున్న జాన్వీ కపూర్‌.. ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల రిలీజైన ‘చుట్టమల్లే’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరోవైపు ఆర్‌సీ16లో కూడా జాన్వీ నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ఆరంభం కానుంది.

Exit mobile version