NTV Telugu Site icon

Uddav Thackeray: హతవిథీ.. ఉద్ధవ్ గుర్తు ఏంటి? త్రిశూలమా? ఉదయించే సూర్యుడా?

Uddav Thackeray

Uddav Thackeray

Uddav Thackeray: మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్, షిండే వర్గాలకు వీల్లేకుండా పోయింది. ఉపఎన్నికల కోసం రెండు రోజుల్లోగా మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించిన విషయం తెలిసిందే.

శివ‌సేన‌కు ఇప్పటిదాకా కొన‌సాగుతున్న ఎన్నిక‌ల గుర్తు విల్లంబును ఇరు వ‌ర్గాలూ వినియోగించడం కుద‌ర‌ద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు క‌మిష‌న్ తెలిపింది. అంతేకాకుండా త్వర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌కు రెండు వ‌ర్గాలు త‌మ త‌మ గుర్తుల‌ను ఎంచుకోవాల‌ని… అది కూడా రెండు రోజుల్లోగా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేయాల‌ని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తూర్పు అంధేరీ ఉపఎన్నికల కోసం శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మూడు పేర్లు, చిహ్నాలతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. దీంతో థాకరే వర్గం ఆదివారం నాడు పార్టీకి గుర్తుగా త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇంకా, ఠాక్రే శిబిరం రాబోయే ఉప ఎన్నికలకు పార్టీ పేరును శివసేన (బాలాసాహెబ్ థాకరే), శివసేన (ప్రబోధంకర్ థాకరే) మరియు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పేర్లను సూచించింది.

Leg Chopped by Robbers: వందేళ్ల వృద్ధురాలి కాలు నరికిన దొంగలు.. ఎందుకో తెలుసా?

శివ‌సేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకున్న షిండే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో శివ‌సేన త‌మ‌దంటే కాదు… త‌మ‌ద‌ని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, షిండే వ‌ర్గాలు వాదులాడుకుంటున్నాయి. ఈ వ్యవ‌హారం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరింది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. ఈ వ్యవ‌హారం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరింది.

Show comments