NTV Telugu Site icon

Trisha Krishnan ‘Raangi’ Movie: రాంగీ కోసం పోరాడుతున్న త్రిష

Raangi

Raangi

Trisha Krishnan Raangi Movie: సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లయిన వన్నె తగ్గని అందంతో ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ త్రిష. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన త్రిష అగ్ర హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాలోయింగ్ సంపాదించుకుంది. కొంత కాలం తెలుగు తెరకు దూరంగా ఉన్నా ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ అలరించింది. ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ అమ్మడు. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.

Read Also: Rajini ‘Baba’ Movie: రీ రిలీజ్‎తోనూ రికార్డ్ క్రియేట్ చేసిన రజినీ.. ఇది తలైవా రేంజ్

ప్రస్తుతం ఆమె జర్నీ చిత్రాన్ని నిర్మించిన శరవణన్ దర్శకత్వంలో రాంగీ అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నాడు. దిగ్గజ దర్శకుడు ఏ.ఆర్ మురుగుదాస్‌ కథ అందిస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా మేకర్స్ ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ రాంగీ సినిమాను డిసెంబర్‌ 30న థియేటర్‌లలోనే రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. దీనితో పాటుగా ప్రస్తుతం త్రిష నటించిన సతురంగ వెట్టై-2, పొన్నియన్‌ సెల్వన్‌-2 రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.