Brinda Release Date: స్టార్ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
- త్రిష తొలి వెబ్ సిరీస్
- ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్
- ఆసక్తికరంగా బృందా టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha’s Brinda Web Series Teaser Out: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్‌లలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చేరారు. ‘సౌత్ క్వీన్’ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. సూర్య మనోజ్ వంగల దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్ర చేశారు. తాజాగా బృందా రిలీజ్ డేట్, టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఓటీటీ వేదికగా ‘సోనీలివ్’లో ఆగస్టు 2 నుంచి బృందా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ మరియు బెంగాలీలో ఈ సిరీస్ విడుదలవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ టీజర్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఒక నిమిషం 28 సెకండ్ల నిడివి గల టీజర్.. ‘మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం.. వీటితో కాదు మనం పోరాడాల్సింది. మనలో ఉన్న మంచితో.. అది మన నుంచి పోకుండా’ అనే డైలాగ్‌తో ఆరంభమైంది. ‘బృందా.. ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత’ అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
Also Read: Nag Ashwin-Kalki 2898 AD: బిగ్గెస్ట్ ఐమాక్స్‌లో ‘కల్కి’ చూడనున్న నాగ్ అశ్విన్!
మూఢనమ్మకాలు, హత్యలు, ఇన్వెస్టిగేషన్ అంశాలతో బృందా టీజర్ ఆసక్తికరంగా ఉంది. మిస్టరీతో కూడిన కేసును పోలీస్ ఆఫీసర్ బృందా దర్యాప్తు చేయనున్నారని టీజర్ బట్టి అర్థమవుతోంది. బృందాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‍లో జయ ప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీలక పాత్రలు చేశారు. యాడింగ్ అడ్వర్టైజింగ్ పతాకంపై కొల్ల ఆశిష్ బృందాను నిర్మించారు. ఈ సిరీస్‍కు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..