Site icon NTV Telugu

Trisha Hikes Remuneration: రేటు పెంచిన త్రిష.. అన్ని కోట్లంటే వామ్మో అంటున్న నిర్మాతలు

Trisha

Trisha

Trisha Hikes Remuneration: వర్షం సినిమాతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది త్రిష. సౌత్ ఇండియాలోని దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం అయింది. ఆమె ఇటీవల పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన అందంతో యువరాణి కుందవై పాత్రలో ఐశ్యర్యారాయ్ కి పోటీగా నిలిచింది. త్రిష కొత్త మూవీ ఆఫర్లు వస్తుండడంతో రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందని టాక్. రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారు. త్రిష మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వం 1కు మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని సమాచారం. కొన్నిరోజుల క్రితం వరకు కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉండేదని టాక్. ప్రస్తుతం విజయ్, అజిత్ లకు జోడీగా ఆఫర్లు వస్తుండటంతో త్రిష తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారని తెలుస్తోంది.

Read Also: Janhvi Kapoor: నిద్ర పట్టకపోయేది.. తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను

ఇది ఇలా ఉండగా ఐదేళ్లుగా సరైన సక్సెస్ లేని త్రిషకు పొన్నియన్ సెల్వన్ 1 ప్లస్ అయింది. త్రిష టాలీవుడ్ ఆఫర్లకు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకులకు కష్టమవుతోంది. సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి నయనతార ఓకే చెబుతున్నా ఆమె రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కావడంతో చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. త్రిష మరికొన్ని ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు త్రిష పెళ్లి గురించి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాల్సి ఉంది. త్రిష పాత్రల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Exit mobile version