Tripti Dimri : ఆ పాపులర్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రం లో రణ్‌బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి..తన అందం తో ఎంతగానో ఆకట్టుకుంది.యానిమల్ సినిమా తో ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది.. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది. కాగా, తృప్తి డిమ్రి కి తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు సమాచారం.. బాలీవుడ్లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్గా తృప్తి డిమ్రికి అవకాశం దక్కిందని సమాచారం.ఆషికీ 3 చిత్రం లో కార్తీక్ ఆర్యన్ హీరో గా చేయనున్నారు. ఈ సినిమా లో కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్గా నటించనున్నారని సమాచారం.
యానిమల్ సినిమా బంపర్ హిట్ తర్వాత తృప్తి డిమ్రి ఫుల్ పాపులరిటీ వచ్చింది.కార్తీక్ ఆర్యన్‌తో ఆమె నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆషికీ 3 మేకర్స్ కొంతకాలంగా అనుకుంటున్నారట. అయితే, ఈ విషయంపై కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఆషికీ 3 చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా మ్యూజికల్ లవ్ స్టోరీగానే రూపొందనుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన మ్యూజిక్ స్కోర్ క్రియేట్ చేస్తామని ఇటీవల అనురాగ్ బసు తెలిపారు.ఆషికీ 3 సినిమా షూటింగ్ 2024 మొదటి మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి మేకర్స్ ప్రకటించనున్నారు
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Tags
- #ashiqi 3
- animal
- Tripti Dimri
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!