Site icon NTV Telugu

Krishna River Water Dispute: నీటి వాటాలు తేలేనా..? కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్‌ విచారణ

Krishna River

Krishna River

Krishna River Water Dispute: కృష్ణా జలాల పంపిణీపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. గతంలో పొరుగు రాష్ట్రాలతో కృష్ణా జలాలపై వివాదాలు సాగుతూ వచ్చేవి.. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వార్‌ నడుస్తూనే ఉంది.. అయితే, కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ జరగనుంది.. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు ట్రిబ్యునల్‌ విచారణ చేపట్టనుంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చనుంది ట్రిబ్యునల్..

Read Also: Marriage Fraud: మత్తెక్కించే అందమే ఆమె పెట్టుబడి.. పెళ్లికాని అబ్బాయిలే టార్గెట్‌గా మోసాలు

మరోవైపు.. ట్రిబ్యునల్ విధివిధానాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.. నదీ జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని.. విభజన చట్టం సెక్షన్ 89(ఏ) – 89(బీ) కింద ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉందని.. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడం తగదని ఏపీ వాదనగా ఉంది.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఈ అభ్యంతరాలనే పేర్కొంది. దీంతో.. కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్‌లో విచారణ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version